ఇళయదళపతి విజయ్ అంటే తమిళనాట ప్రాణాలు ఇచ్చే అభిమానులున్నారు. రజినీ తరువాత అంతటి మాస్ ఇమేజ్ సంపాదించుకున్న కథానాయకుడు విజయ్. ఇప్పుడు అతడికి అరుదైన గౌరవం లభించింది. కన్యాకుమారిలోని ప్రముఖ మాయాపురి మ్యూజియంలో ఈ హీరో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.
మ్యూజియంలో విజయ్ 'బొమ్మ' అదుర్స్ - vijay wax
తమిళ నటుడు విజయ్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ హీరో ఓ ఘనత సొంతం చేసుకున్నాడు. కన్యాకుమారిలోని ఓ మ్యూజియంలో అతడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
'తెరి' సినిమాలో (తెలుగులో పోలీసోడు) జోసెఫ్ కురువిల్లా పాత్ర లుక్‌తో ఆ విగ్రహాన్ని రూపొందించారు. అభిమానులు ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల మధ్య మ్యూజియంకి వెళ్లి విజయ్ విగ్రహంతో స్వీయచిత్రాలు తీసుకోవచ్చు. ఈ ప్రముఖ మ్యూజియంలో ఇప్పటి వరకు ఏ తమిళ నటుడి విగ్రహం ఏర్పాటు చేయలేదు. మొదటిది విజయ్‌ది కావడం విశేషం. అక్కడ ఇప్పటికే ఏపీజే అబ్దుల్ కలామ్, అమితాబ్ బచ్చన్, మదర్ థెరిస్సా, మైఖెల్ జాక్సన్, ఒబామా, చార్లీ చాప్లిన్, రవీంద్రనాథ్ ఠాగూర్ వంటి ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేశారు.
ఇవీ చూడండి.. ఓ ఇంటి వాడైన విజయ్ దేవరకొండ..!