కోలీవుడ్ దర్శకుడు అట్లీ, హీరో విజయ్‌ది సూపర్‌హిట్ కాంబినేషన్. 'తేరి', 'మెర్సల్' చిత్రాల తర్వాత వీరిద్దరూ కలిసి చేస్తోన్న సినిమా 'బిగిల్'. దీనికి విజిల్, ఈల అని అర్ధం. ఈ సినిమాలో నటుడిగానే కాకుండా గాయకుడిగానూ ఆకట్టుకోనున్నాడు దళపతి. స్వరమాంత్రికుడు రెహమాన్ సారథ్యంలో విజయ్ గాత్రంతో 'వెర్రితనం' పేరుతో పాట రూపొందిస్తున్నారు. పాటల రచయిత వివేక్ లిరిక్స్ రాశాడు.
గతంలో హ్యారిస్ జయరాజ్‌తో కలిసి 'తుపాకీ' చిత్రంలో, జీవీ ప్రకాశ్‌తో 'తేరి' సినిమాలో పాట పాడాడు విజయ్. సర్కార్ మూవీలో పాట పాడించేందుకు రెహమాన్ ప్రయత్నించినా కుదరలేదు. 'బిగిల్'లో తొలిసారి వీరిద్దరి కాంబోలో పాట రాబోతోంది.