సూపర్‌స్టార్ మహేశ్ హీరోగా రాబోతున్న 'సరిలేరు నీకెవ్వరూ' చిత్రంతో తెరపై రీఎంట్రీ ఇవ్వనుంది విజయశాంతి. 30 ఏళ్ల క్రితం 'కొడుకుదిద్దిన కాపురం' తర్వాత మళ్లీ వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. రాములమ్మతో తీసుకున్న ఫొటోను ఇటీవల నెటిజన్లతో పంచుకున్నాడు ప్రిన్స్. ఈ ట్వీట్‌కు తాజాగా స్పందించింది విజయశాంతి.
"కాలచక్రంలో సంవత్సరాలు మారాయి. కానీ మహేశ్ వ్యక్తిత్వం మారలేదు. ఆయన వ్యక్తిత్వానికి క్యూట్‌నెస్ కిరీటంలాంటిది. 1989లో మనం నటించిన చిత్రం కొడుకు దిద్దిన కాపురం. 1980లో అదే రోజు కృష్ణగారు హీరోగా వచ్చిన కిలాడీ కృష్ణుడుతో వెండితెరకు పరిచయమయ్యాను."
-విజయశాంతి ట్వీట్
'కొడుకు దిద్దిన కాపురం' సినిమా చిత్రీకరణలో మహేశ్-విజయశాంతి దిగిన ఫొటోను షేర్ చేసిన సూపర్‌స్టార్ ఈ విధంగా కామెంట్ పెట్టాడు.