'పెళ్లి సందD' ట్రైలర్(pelli sandadi new movie).. సెప్టెంబరు 22(బుధవారం) ఉదయం 11గంటలకు రానుంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబు రిలీజ్ చేయనున్నారు. రోషన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా ఈ సినిమాలో నటించారు. దర్శకుడు కె.రాఘవేంద్రరావు(pelli sandadi 2021 trailer).. ఈ చిత్రంతోనే నటుడిగా పరిచయమవుతున్నారు. గౌరి రోనంకి దర్శకురాలు.
టీజర్ రిలీజ్
ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సోదరుడైన శిరీష్ తనయుడు ఆశీష్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా 'రౌడీబాయ్స్'(rowdy boys movie). 'హుషారు' దర్శకుడు శ్రీ హర్ష కొనెగంటి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టీజర్ విడుదలై ఆకట్టుకుంటోంది. అనుపమ పరమేశ్వరన్ కథానాయిక. దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు.