తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తూ బిజీగా ఉన్న విలక్షణ నటుడు విజయ్ సేతుపతి.. త్వరలో మూకీ చిత్రంలో ప్రధానపాత్ర పోషించనున్నారు. 'గాంధీ టాక్స్' టైటిల్‌తో పాటు ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆయన పుట్టినరోజు సందర్భంగా శనివారం విడుదల చేశారు.
విజయ్ సేతుపతి మూకీ సినిమా.. పోస్టర్ రిలీజ్ - విజయ్ సేతుపతి లేటేస్ట్ న్యూస్
విజయ్ సేతుపతి మూకీ చిత్రంలో నటించేందుకు అంగీకారం తెలిపారు. దీనిని పాన్ ఇండియా కథతో తీస్తున్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో థియేటర్లలోకి సినిమా వచ్చే అవకాశముంది.
విజయ్ సేతుపతి
ఈ పోస్టర్లో కరెన్సీ నోట్ల మధ్య ఉన్న విజయ్ సేతుపతి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు కిశోర్ పాండురంగ్ దర్శకుడు. మూవీ మిల్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్న 'గాంధీ టాక్స్'ను తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ, మరాఠా భాషల్లో విడుదల చేయనున్నారు.
ఇవీ చదవండి:
Last Updated : Jan 16, 2021, 5:01 PM IST