తెలంగాణ

telangana

ETV Bharat / sitara

వెండితెర ముత్తయ్య మురళీధరన్​గా విజయ్ సేతుపతి - Vijay Sethupathi latest news

స్పిన్ మాంత్రికుడు ముత్తయ్య మురళీధరన్ బయోపిక్​లో స్టార్ కథానాయకుడు విజయ్ సేతుపతి నటించనున్నట్లు ప్రకటించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

Vijay Sethupathi to star in cricketer Muthiah Muralidaran biopic
వెండితెర ముత్తయ్య మురళీధరన్​గా విజయ్ సేతుపతి

By

Published : Oct 8, 2020, 12:24 PM IST

శ్రీలంక స్పిన్ దిగ్గజం ముత్తయ్య మురళీధరన్ బయోపిక్​పై స్పష్టత వచ్చేసింది. ఎప్పటి నుంచో వస్తున్న వార్తలకు చెక్​ పెడుతూ అధికారికంగా ప్రకటించారు. తమిళ స్టార్ నటుడు విజయ్ సేతుపతి టైటిల్ రోల్ పోషించనున్నారు.

ఈ సినిమాకు ఎమ్.ఎస్. శ్రీపతి దర్శకత్వం వహించనున్నారు. మూవీ ట్రైన్ మోషన్ పిక్చర్స్, దార్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలో పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.

1992-2014 మధ్య లంక తరఫున ఆడిన ముత్తయ్య మురళీధరన్.. టెస్టుల్లో 800 వికెట్లు తీసిన తొలి బౌలర్​గా రికార్డులకెక్కాడు. దానిని అందుకోవడం ఇప్పట్లో ఏ ఆటగాడికి సాధ్యం కాదేమో! 133 టెస్టుల్లో 800 వికెట్లు, 350 వన్డేల్లో 534 వికెట్లు, 12 టీ20ల్లో 13 వికెట్లు తీశాడు మురళీధరన్.

ABOUT THE AUTHOR

...view details