ఉత్తరాది, దక్షిణాది తేడా లేకుండా పలు సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఇటీవల వచ్చిన 'మాస్టర్'లో ప్రతినాయకుడిగా ఆకట్టుకున్న ఇతడు.. 'ద ఫ్యామిలీ మ్యాన్' ఫేమ్ రాజ్-డీకే దర్శకత్వం వహిస్తున్న ఓ వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు. గోవాలో షూటింగ్ జరుగుతోంది.
దర్శక ద్వయంతో హీరో షాహిద్ కపూర్ అయితే ఈ సిరీస్ కోసం సేతుపతి, హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకోనున్నట్లు తెలుస్తోంది. సినీ వర్గాల్లో ప్రస్తుతం ఈ వార్త చర్చనీయాంశమైంది.
ఈ వెబ్ సిరీస్‌తోనే బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ తొలిసారి డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. రాశీఖన్నా హీరోయిన్గా నటిస్తోంది. అయితే ఈ సిరీస్ కోసం షాహిద్.. దాదాపు రూ.40 కోట్లు తీసుకుంటున్నారట. తొలి సీజన్ హిట్ అయితే రెండో సీజన్ తీసే అవకాశమున్న నేపథ్యంలోనే నిర్మాతలు అతడికి ఇంత మొత్తం చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇందులోనే నటిస్తున్న విజయ్ సేతుపతికి రూ.55 కోట్ల మేర నిర్మాతలు ఇస్తున్నారు! ఈ ఏడాది చివర్లో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో ఓటీటీలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
ఇవీ చదవండి: