తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఆ హీరో కుటుంబం మొత్తం సమంత అభిమానులే - కాతువాకుల రెండు కాదల్

టాలీవుడ్ నటి సమంతపై తన అభిమానాన్ని చాటుకున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. ఆమెకు తాను చాలా పెద్ద ఫ్యాన్​ అని చెప్పారు.

vijay sethupathi says he's a big of samantha
'మా కుటంబం మొత్తం ఆమె అభిమానులమే'

By

Published : Jan 7, 2021, 12:48 PM IST

Updated : Jan 7, 2021, 1:28 PM IST

టాలీవుడ్ నటి సమంతకు తాను చాలా పెద్ద అభిమానినని చెప్పారు తమిళ స్టార్ విజయ్ సేతుపతి. వారిద్దరూ ప్రస్తుతం 'కాతువాకుల రెండు కాదల్' చిత్రంలో నటిస్తున్నారు. సినిమా చిత్రీకరణ దశలో ఉంది.

"నా కొడుకు, నేను సమంతకు చాలా పెద్ద ఫ్యాన్స్. నిజానికి మా కుటుంబం మొత్తం ఆమె అభిమానులమే. ఆమెతో కలిసి నటించడం ఆనందంగా ఉంది."

-విజయ్ సేతుపతి, తమిళ నటుడు

విఘ్నేశ్ శివన్​ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మరో నాయికగా నయనతార నటిస్తున్నారు. 7స్క్రీన్ స్టూడియోస్, రౌడీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

2019లో వచ్చిన 'సూపర్ డీలక్స్' చిత్రంలో కలిసి నటించారు సమంత, విజయ్​ సేతుపతి. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో ఇదివరకే 'నేనూ రౌడీనే' సినిమాకు పనిచేశారు సేతుపతి, నయన్​. ఈ ముగ్గురు నటుల కలయికలో వచ్చే తొలిచిత్రం అయినందువల్ల 'కాతువాకుల రెండు కాదల్​'పై భారీ అంచనాలున్నాయి.

సమంత ప్రస్తుతం.. ఆహా ఓటీటీలో 'సామ్ జామ్' కార్యక్రమం నిర్వహిస్తోంది. త్వరలోనే అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనుంది. ఆమె నటించిన 'ఫ్యామిలీ మ్యాన్ 2' సిరీస్ త్వరలోనే విడుదలనుంది.

ఇదీ చూడండి:నటుడు సోనూసూద్​పై పోలీస్ కేసు

Last Updated : Jan 7, 2021, 1:28 PM IST

ABOUT THE AUTHOR

...view details