తమిళ నటుడు విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించిన మలయాళ సినిమా 'మార్కొని మతాయ్'. సనల్ కలతిల్ దర్శకత్వం వహించారు. కుటుంబ కథా చిత్రంగా రూపొందిన ఈ సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. ఇప్పుడీ సినిమా తెలుగులో 'రేడియో మాధవ్' పేరుతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
తెలుగులో విడుదల కానున్న విజయ్ మలయాళ సినిమా - Vijay sethupathi marconi mathay movie in telugu
మలయాళంలో సూపర్‌హిట్‌గా నిలిచిన 'మార్కొని మతాయ్'.. తెలుగులో 'రేడియో మాధవ్' పేరుతో విడుదల కానుంది. ఇందులో తమిళ నటుడు విజయ్ సేతుపతి, జయరామ్ హీరోలుగా నటించారు. ఈ చిత్ర పోస్టర్‌ను యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశాడు.
విజయ్
విజయ్ సేతుపతి నటించిన తొలి మలయాళ సినిమా ఇదే కావడం విశేషం. లక్ష్మి చెన్నకేశవ ఫిల్మ్స్ పతాకంపై కృష్ణస్వామి నిర్మించిన ఈ చిత్ర పోస్టర్‌ను యువ కథానాయకుడు శ్రీవిష్ణు విడుదల చేశాడు. ఈ సినిమా తెలుగులో విడుదలవుతుండటం పట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీవిష్ణు... మంచి విజయం సాధించాలని ఆకాంక్షించాడు.
ఇదీ చూడండి జైలు నుంచి విడుదలైన రియా చక్రవర్తి