విజయ్ సేతుపతి(vijay sethupathi new movie).. ఈ పేరు చాలు. అభిమానుల్ని థియేటర్‌కు రప్పించడానికి. ఇతడు నటిస్తున్నాడంటే సినిమాలో ఏదో కొత్తదనం ఉంటుందని ఫిక్సయిపోవచ్చు. అలాంటి విజయ్.. తాను నటించిన చిత్రాలు(vijay sethupathi movies) అసలు చూడనని అన్నారు. అందుకు గల కారణాన్ని చెప్పారు.
"నేను ఓ నటుడ్ని. నటన లేకపోతే నేను లేను. అందుకే స్టార్డమ్, ఇతరత్రా వాటిని నా మైండ్లోకి రానివ్వను. కేవలం పనిమీద మాత్రమే దృష్టి పెడతాను. రోజంతా పనిచేయడం.. ఆ తర్వాత ఇంటికి వెళ్లి నిద్రపోవడం. ఇదే చేస్తా. సినిమాలు కూడా చూడటం ఇష్టముండదు" అని విజయ్ సేతుపతి(vijay sethupathi movies list) చెప్పారు.
కనీసం మీరు నటించిన సినిమాలు అయినా చూస్తారా? అని సేతుపతిని అడగ్గా.. "డబ్బింగ్ చెప్పినప్పుడే చూస్తా. నా సినిమాలు నేను చూడటం చాలా కష్టం. ఇంకా చెప్పాలంటే నాకు భయం. నేను చేసిన తప్పులు నాకు కనిపిస్తాయి. అది మంచిది కాదు" అని విజయ్ చెప్పారు.