తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'ది ఫ్యామిలీ మ్యాన్ 3​' సిరీస్​పై విజయ్​ సేతుపతి క్లారిటీ - The Family Man 3

'ది ఫ్యామిలీ మ్యాన్ 3​' ​(The Family Man) సీజన్​లో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలను కొట్టిపారేశారు నటుడు విజయ్​ సేతుపతి(Vijay Sethupati). ఈ సిరీస్​​ కోసం తనను ఎవరూ సంప్రదించలేదని తెలిపారు.

vijay sethupati
విజయ్​ సేతుపతి

By

Published : Jul 11, 2021, 8:26 PM IST

దర్శకద్వయం రాజ్​ అండ్​ డీకే తెరకెక్కించిన 'ది ఫ్యామిలీ మ్యాన్​' ​(The Family Man) వెబ్​సిరీస్​లో విడుదలైన రెండు సీజన్లకు ఓటీటీలో ఎంతటి ప్రేక్షకాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా మూడో సీజన్​ను తీసుకురావాలని చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అయితే ఇందులో స్టార్​ నటుడు విజయ్​ సేతుపతి(Vijay Sethupati) నటిస్తున్నారంటూ కొద్ది రోజులుగా ప్రచారం సాగుతోంది.

తాజాగా దీనిపై స్పందించిన విజయ్​.. ఇందులో తాను నటించట్లేదని స్పష్టం చేశారు. "షాహిద్​కపూర్​తో రాజ్​ అండ్​ డీకే తెరకెక్కిస్తున్న వెబ్​సిరీస్​లో మాత్రమే నటిస్తున్నాను. మనోజ్​ బాజ్​పాయ్​తో నటించేందుకు నాకు ఎంతో ఇష్టమైనప్పటికీ 'ది ఫ్యామిలీ మ్యాన్ 3' కోసం నన్ను ఎవరు సంప్రదించలేదు." అని విజయ్​ అన్నారు.

ప్రస్తుతం విజయ్​.. 'తుగ్లక్​ దర్బార్'​, 'లాబమ్'​, 'విదుథలై', 'విక్రమ్'​, 'ముంబైకర్'​, 'గాంధీ టాక్స్'​ సహా పలు చిత్రాల్లో నటిస్తున్నారు.

ఇదీ చూడండి: విజయ్​ సేతుపతి కొత్తచిత్రాల కబుర్లు

ABOUT THE AUTHOR

...view details