విజయ్ సేతుపతి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లోని సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న నటుడు ఈయన. దీంతో పాటే వెబ్ సిరీస్‌లు, షార్ట్ ఫిల్మ్స్‌లో కీలక పాత్రలు పోషిస్తూ సందడి చేస్తున్నారు.
వంటల ప్రోగ్రామ్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి! - Vijay Sethupathi movie news
సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా ఉన్న విజయ్ సేతుపతి.. టీవీ తెరపై మరో కొత్త షోతో ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్నారట. రానున్న వేసవిలో ప్రసారం కాబోయే ఈ ప్రోగ్రామ్ కోసం భారీగా రెమ్యునరేషన్ తీసుకోనున్నారని సమాచారం.

వంటల ప్రోగ్రామ్ హోస్ట్‌గా విజయ్ సేతుపతి!
ఇప్పుడు తమిళంలో 'కుకు విత్ కోమలి' షోకు కొనసాగింపుగా రానున్న ఓ వంటల ప్రోగ్రామ్‌కు వ్యాఖ్యాతగా వ్యవహరించేందుకు విజయ్ అంగీకారం తెలిపినట్లు సమాచారం. ఇందుకోసం ఆయనకు భారీ మొత్తం ఇచ్చే ఆలోచనలో నిర్వహకులు ఉన్నారట.
ఇప్పటికే ప్రముఖ తమిళ ఛానెల్లో 'నమ్మ ఒరు హీరో' షోకు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు విజయ్. ఇది అత్యధిక టీఆర్పీ రేటింగ్‌లు దక్కించుకుని, ప్రేక్షకుల్ని అలరిస్తోంది.