తెలంగాణ

telangana

By

Published : Sep 28, 2019, 6:31 AM IST

Updated : Oct 2, 2019, 7:28 AM IST

ETV Bharat / sitara

విలన్​ పాత్ర కోసం విజయ్ సేతుపతికి రూ.5 కోట్లు..!

మెగాహీరో వైష్ణవ్​తేజ్​ నటిస్తోన్న 'ఉప్పెన'లో ప్రతినాయకుడి పాత్ర పోషించేందుకు తమిళ స్టార్​ హీరో విజయ్ సేతుపతికి రూ.5 కోట్లు పారితోషికం ఇవ్వనున్నట్లు సమాచారం.

సైరా సినిమాలో విజయ్ సేతుపతి

వైవిధ్యభరిత చిత్రాలు, పాత్రలతో దక్షిణాదిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. అతడు నటించిన 'సైరా'... త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే కాకుండా మెగాహీరో వైష్ణవ్​తేజ్​ హీరోగా పరిచయమవుతున్న 'ఉప్పెన'లో ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నాడు. ఇప్పుడు ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకొచ్చింది.

సాయిధరమ్ తేజ్​ తమ్ముడు వైష్ణవ్​తేజ్.. తొలి చిత్రం 'ఉప్పెన'. షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఇందులో నటిస్తోన్న విజయ్​ సేతుపతికి దాదాపు రూ.5 కోట్లు పారితోషికంగా ఇవ్వనున్నారట. ఇంత భారీ మొత్తం ఇచ్చేందుకు చిత్ర నిర్మాతలు తొలుత సంకోచించినప్పటికీ విజయ్‌ వల్ల అటు తమిళంతో పాటు తెలుగులో మంచి హైప్‌ వస్తుందని ఓకే చెప్పారని సమాచారం.

ఇందులో హీరోయిన్​ తండ్రిగా కనిపించనున్నాడు విజయ్. ఈ చిత్రంతో సుకుమార్ సహాయకుడు బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.

ఇది చదవండి: బేస్​బాల్​ ప్లేయర్​తో హీరో సోదరి ప్రేమాయణం

Last Updated : Oct 2, 2019, 7:28 AM IST

ABOUT THE AUTHOR

...view details