విభిన్న పాత్రలు చేస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను తెచ్చుకున్న నటుడు విజయ్ సేతుపతి. పాత్ర ఏదైనా సరే అందులో ఇమిడిపోయి ప్రేక్షకులను మెప్పిస్తుంటాడు. ప్రస్తుతం బాలీవుడ్లో ఆమిర్‌ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే ఈ విషయాన్ని ధ్రువీకరించాడు. అనంతరం మాట్లాడిన విజయ్.. కళకు భాషా, ప్రాంతం అనే తేడా ఉండదు. భాషా, సాంస్కృతికంగా తనకు ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాలేదని చెప్పాడు.
ఈసారి ఆమిర్‌ఖాన్ సినిమాలో విజయ్ సేతుపతి
ఆమిర్‌ఖాన్ నటిస్తున్న 'లాల్ సింగ్ చద్దా'లో తమిళ హీరో విజయ్ సేతుపతి కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ విషయాన్ని ఇటీవలే జరిగిన ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు విజయ్.
విజయ్ సేతుపతి
ఈ సినిమాలో కరీనా కపూర్, మానవ్ గోహిల్, వివేక్ గార్గ్ తదితరలు నటిస్తున్నారు. ఏఆర్.రెహమాన్-ప్రీతమ్‌లు సంగీతమందిస్తున్నారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆమిర్‌ఖాన్ ప్రొడక్షన్స్, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వచ్చే ఏడాది డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.
ఇది చదవండి: 'భారతీయుడు-2'లో విలన్‌గా విజయ్ సేతుపతి?