వివైధ్య, విలక్షణ నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని చూరగొంటున్నారు తమిళ నటుడు విజయ్ సేతుపతి. తమిళ, తెలుగు సినిమాల్లో ప్రతినాయకుడిగా, క్యారక్టర్ ఆర్టిస్టుగానూ నటిస్తూ మెప్పిస్తున్నారు. ప్రస్తుతం ఆయన హీరోగా తెలుగులో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనుందని టాక్.
మైత్రీ మూవీస్ నిర్మాణ సంస్థ సేతుపతికి ఓ కథను వినిపించారట. అయితే దీనిపై అధికారికంగా వార్త బయటకు రాలేదు. త్వరలోనే సినిమాకు సంబంధించి ఓ ప్రకటన రానుందని తెలుస్తోంది. టాలీవుడ్లో నటించేందుకు విజయ్ ఇప్పటికే తెలుగు భాష నేర్చుకుంటున్నారని సమాచారం.