తమిళ స్టార్ హీరో తళపతి విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కోట్లమంది అభిమానులు అతడి సొంతం. అలాంటిది ఈ కథానాయకుడు ఓసారి, తన కాస్ట్యూమ్ నచ్చలేదని పాట షూటింగ్‌కు హాజరు కాలేదట. ఈ విషయాన్ని నటి వనిత విజయ్ కుమార్ వెల్లడించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దీనిని పంచుకుంది.
"చంద్రలేఖ'(1995) సినిమా షూటింగ్లో 'అల్లా ఉన్ ఆనై' పాట చిత్రీకరణ జరుగుతోంది. ఆ సమయంలో విజయ్‌కు ఇచ్చిన కాస్ట్యూమ్ నచ్చలేదు. దీంతో అతడు షూటింగ్‌కు హాజరయ్యేందుకు ఇష్టపడలేదు. అప్పట్లో డిజైనర్స్ లేకపోవడం వల్ల మా బట్టలు కాస్ట్యూమర్సే కుట్టేవారు" -వనిత విజయ్ కుమార్, నటి