తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ముంబయిలో విజయ్-రష్మిక జోడీ హల్​చల్..! - కరణ్ జోహార్

మంగళవారం సాయంత్రం ముంబయిలో జంటగా కనిపించి అభిమానుల్లో సందేహం రేకెత్తించారు విజయ్ దేవరకొండ-రష్మిక.

ముంబయిలో విజయ్-రష్మిక జోడి..!

By

Published : Sep 4, 2019, 1:35 PM IST

Updated : Sep 29, 2019, 10:00 AM IST

టాలీవుడ్​ యువహీరో విజయ్ దేవరకొండ, రష్మిక.. మంగళవారం సాయంత్రం ముంబయిలో కనిపించారు. మరోసారి వీరిద్దరూ జంటగా కనిపించడం అభిమానులను ఆలోచనల్లో పడేసింది. అసలు విషయం ఏంటంటే వీరు నటించిన 'డియర్​ కామ్రేడ్​'.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆ సినిమా ప్రత్యేక ప్రదర్శనను ముంబయిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హీరోహీరోయిన్లు ఇద్దరూ హాజరయ్యారు.

కార్యక్రమంలో సందడి చేసిన విజయ్ దేవరకొండ-రష్మిక మందణ్న

దక్షిణాదిలో నాలుగు భాషల్లో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు భరత్ కమ్మ దర్శకత్వం వహించాడు. ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ఇప్పటికేఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను దక్కించుకున్నారు.

ప్రదర్శన అనంతరం వస్తున్నవిజయ్-రష్మిక

ఇది చదవండి: అతిలోక సుందరే కదా..! నిజమా? భ్రాంతా?

Last Updated : Sep 29, 2019, 10:00 AM IST

ABOUT THE AUTHOR

...view details