తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'మాస్టర్' థియేటర్లకు వచ్చేది అప్పుడేనా! - 'మాస్టర్' థియేటర్లకు వచ్చేది అప్పుడేనా!

తమిళ హీరో విజయ్ ప్రధాన పాత్రలో, లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. మొదట ఈ సినిమాను ఏప్రిల్​లో విడుదల చేయాలని భావించినా.. కరోనా కారణంగా వాయిదా వేశారు. ప్రస్తుతం మరో తేదీని చిత్రబృందం నిర్ణయించినట్లు సమాచారం.

మాస్టర్
మాస్టర్

By

Published : Apr 18, 2020, 5:34 AM IST

ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్‌ నటిస్తున్న చిత్రం 'మాస్టర్‌'. లోకేశ్‌ కనగరాజన్‌ దర్శకుడు. మాళవిక మోహనన్‌ నాయిక. విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడుగా కనిపించనున్నాడు. ముందుగా ఈ చిత్రాన్ని ఏప్రిల్‌లో విడుదల చేయాలని భావించింది చిత్రబృందం. అయితే లాక్‌డౌన్‌ కారణంగా వాయిదా పడింది.

తాజాగా మరో విడుదల తేదీ కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతుంది. కొంతకాలం ఆలస్యమైనా విజయ్‌ పుట్టిన రోజు కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలని దర్శకనిర్మాతలు అనుకుంటున్నారట. జూన్‌ 22న విజయ్‌ పుట్టిన రోజు. అప్పటికి పరిస్థితులు అనుకూలంగా ఉంటాయని ఆలోచించిన చిత్రబృందం.. ఈ నిర్ణయం తీసుకుందని టాక్‌. త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

ABOUT THE AUTHOR

...view details