తెలంగాణ

telangana

ETV Bharat / sitara

బిజిల్​లో విజయ్​ పోషిస్తోన్న పాత్రలు ఇవే! - అట్లీ

దళపతి విజయ్​ కొత్తం చిత్రం బిజిల్​లో ద్విపాత్రాభినయంతో మెప్పించనున్నారు. 85 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా తొలిరూపు అభిమానులను ఆకట్టుకుంటోంది.

బిజిల్​లో విజయ్​ పోషిస్తోన్న పాత్రలు ఇవే!

By

Published : Jun 29, 2019, 8:01 AM IST

తమిళనాట విజయవంతమైన అట్లీ కుమార్​- ఇళయ దళపతి విజయ్​ కాంబినేషన్​లో రూపుదిద్దుకుంటున్న కొత్త చిత్రం బిజిల్. ఇప్పటికే 85 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది. తొలిరూపు అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.

అయితే ఈ చిత్రంలో విభిన్న పాత్రల్లో విజయ్​ నటిస్తున్నారని ప్రచారం సాగుతోంది. పోస్టర్​ విడుదల తర్వాత సినిమాలో విజయ్​ ఎన్ని పాత్రల్లో కనిపిస్తారన్న విషయమై తమిళనాట చర్చ జరుగుతోంది. ఈ చిత్రంలో తండ్రీకొడుకుల పాత్రల్లో నటిస్తున్నారని కోలీవుడ్​ వర్గాలు తెలిపాయి. ఇందులో తండ్రి పాత్ర పేరు బిజిల్​ కాగా కొడుకు మైఖెల్​ అని చెబుతున్నారు. కథానాయిక నయనతార.. ఏంజెల్​ అనే పేరుతో కనిపించనుంది.

అట్లీ కుమార్, విజయ్ కాంబినేషన్లో మెర్సల్, తేరీ లాంటి బ్లాక్​బస్టర్​ చిత్రాలు వచ్చాయి. ఈ ఫ్లేవర్​లో వస్తోన్న బిజిల్​పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇదీ చూడండి: ఏజెంట్​ ఆత్రేయకు దర్శకేంద్రుడి ప్రశంసలు

ABOUT THE AUTHOR

...view details