తెలంగాణ

telangana

ETV Bharat / sitara

కూల్​ లుక్​లో రౌడీ హీరో.. ఆ సినిమా కోసమే! - Vijay Deverakonda viral Photos

Vijay Deverakonda New Look: యువ హీరో విజయ్ దేవరకొండ కొత్త లుక్​కు సంబంధించి ఓ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ ఈవెంట్​లో న్యూలుక్​లో కనిపించాడు విజయ్​. షార్ట్​ హెయిర్​తో ఆ కార్యక్రమానికి హాజరయ్యాడు. అతని తదుపరి సినిమా 'జన గణ మన'లోనూ ఇదే స్టైల్​లో కనిపించనున్నట్లు నెటిజన్లు భావిస్తున్నారు.

Vijay Deverakonda
విజయ్​ దేవరకొండ

By

Published : Feb 28, 2022, 7:26 PM IST

Vijay Deverakonda New Look: 'అర్జున్​రెడ్డి', 'గీతాగోవిందం' సినిమాలతో యువతకు దగ్గరైన యువహీరో విజయ్​ దేవరకొండ కొత్త లుక్​లో కనిపించాడు. 'లైగర్'​ చిత్రంలోని తన బాక్సర్​ లుక్​ కోసం దాదాపు రెండేళ్లు పాటు పొడవాటి జుట్టును మెయింటైన్​ చేసిన విజయ్​.. ఆ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత తన జట్టును కత్తిరించినట్లు తెలుస్తోంది. తాజాగా హైదరాబాద్​లో జరిగిన ఓ ఈవెంట్​లో విజయ్​ షార్ట్​ హెయిర్​తో కనిపించాడు. ఆ కార్యక్రమంలో విజయ్​ ఫొటోను ఎవరో క్లిక్​మనిపించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్​ చేయగా.. వైరల్​గా మారింది. ఆ ఫొటోలో విజయ్​ షార్ట్​ హెయిర్​తో స్టైలిష్​గా, కూల్​గా, తలపై క్యాప్​తో హ్యాండసమ్​గా కనిపిస్తున్నాడు.

కొత్త లుక్​లో విజయ్​ దేవరకొండ

ప్రైమ్​ వాలీబాల్​ లీగ్​ కోసం హైదరాబాద్​లోని గచ్చిబౌలి ఇండోర్​ స్టేడియంలో విజయ్​ కొత్త లుక్​తో కనిపించాడు. ఇప్పటికే విజయ్​-పూరీ జగన్నాథ్​ కాంబోలో 'లైగర్​' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. వీరిద్దరి కాంబినేషన్​లో 'జన గణ మన' తెరపైకెక్కించనున్నట్లు పూరీ క్లారిటీ ఇచ్చాడు. ఈ సినిమా చిత్రీకరణ ఏప్రిల్​ నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఇందులో విజయ్​ సైనికాధికారిగా కనిపించనున్నట్లు సమాచారం. అందుకోసమే విజయ్​ కొత్త హెయిర్​స్టైల్​ చేయించుకున్నట్లు తెలుస్తోంది.

కాగా విజయ్​ నటించిన మిక్స్‌డ్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'లైగర్‌' ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకురానుంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. ప్రముఖ బాక్సర్‌ మైక్‌టైసన్‌ కీలక పాత్ర పోషించారు. విజయ్‌ సరసన అనన్య పాండే సందడి చేయనుంది.

ఇదీ చూడండి:ట్రైలర్స్​తో సెబాస్టియన్, మారన్.. రిలీజ్​ డేట్​తో తాప్సీ

ABOUT THE AUTHOR

...view details