యువతరంలో ప్రస్తుతం క్రేజ్ ఉన్న టాలీవుడ్ హీరో ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు విజయ్ దేవరకొండ. గత నాలుగు సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా, అతడి ఆదరణ మాత్రం తగ్గట్లేదు. ఇటీవలే 'వరల్డ్ ఫేమస్ లవర్' అంటూ వచ్చి నిరాశపరిచాడు. కానీ ఇప్పుడు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్‌తో భారీ డీల్ కుదుర్చుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతన్నది తెలియాల్సి ఉంది.
విజయ్ దేవరకొండతో ఆ నిర్మాత రూ.100 కోట్ల డీల్? - #VD10
యువహీరో విజయ్ దేవరకొండ.. నిర్మాత కరణ్ జోహార్‌తో రూ.100 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడట. ఇందులో భాగంగా అతడు తీసే పలు చిత్రాల్లో నటించనున్నాడీ కథానాయకుడు.
![విజయ్ దేవరకొండతో ఆ నిర్మాత రూ.100 కోట్ల డీల్? Vijay Deverakonda signs a whopping deal with Karan Johar?](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6312755-596-6312755-1583467876631.jpg)
విజయ్ దేవరకొండ
ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు విజయ్. ముంబయిలో చిత్రీకరణ సాగుతోంది. చార్మి, పూరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమా నిర్మాణంలో కరణ్ పాలు పంచుకున్నాడు. ఈ క్రమంలోనే విజయ్‌తో దాదాపు రూ.100 కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఇందులో భాగంగా తాను నిర్మించే లేదా దర్శకత్వం వహించే చిత్రాల్లో విజయ్ నటిస్తాడు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వీటిని తెరకెక్కించనున్నారు. ఇదే నిజమైతే విజయ్ పంట పండినట్లే.
ఇది చదవండి:బైక్‌పై అనన్యతో విజయ్ దేవరకొండ రొమాన్స్!