తెలంగాణ

telangana

ETV Bharat / sitara

యశ్‌ నుంచి దీన్ని దొంగిలిస్తా: విజయ్‌ దేవరకొండ - క్రాంతి మాధవ్​

టాలీవుడ్​ లవర్​బాయ్​ విజయ్​ దేవరకొండ మరోసారి తన చమత్కారంతో అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు. ఇటీవలే జరిగిన ఓ అవార్డు ఫంక్షన్​లో పాల్గొని సందడి చేశాడు.

vijay-deverakonda-revealed-that-he-wants-to-stole-this-from-yash
యశ్‌ నుంచి దీన్ని దొంగిలిస్తా: విజయ్‌దేవరకొండ

By

Published : Jan 1, 2020, 7:01 AM IST

ఇటీవలే జరిగిన ఓ అవార్డు వేడుకల్లో టాలీవుడ్‌ స్టార్‌ విజయ్‌ దేవరకొండతోపాటు కన్నడ హీరో యశ్‌ కూడా పాల్గొన్నాడు. ఈ సందర్భంగా 'యశ్‌ నుంచి ఓ వస్తువును దొంగిలించమంటే దేన్ని దొంగిలిస్తారు?' అని విజయ్‌ను వేదికపై అడిగారు. దానికి ఆయన ఏ మాత్రం తడుముకోకుండా 'ప్రశాంత్‌ నీల్‌' అని సమాధానం ఇచ్చాడు. అనంతరం విజయ్‌ నవ్వుతూ.. ‘ఆయన్ను దొంగిలిస్తే రహస్యంగా 'కేజీఎఫ్‌ 3' సినిమా తీయవచ్చని జోక్‌ చేశాడు.

హీరో యశ్​, డైరెక్టర్​ ప్రశాంత్​నీల్​

'కేజీఎఫ్‌-1'తో దేశవ్యాప్తంగానే కాకుండా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న కన్నడ స్టార్‌ యశ్. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో సినీ అభిమానుల్ని ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా 'కేజీఎఫ్‌-2'ను తెరకెక్కుతోంది. విజయ్‌ దేవరకొండ ప్రస్తుతం 'వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. క్రాంతి మాధవ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న విడుదల కాబోతోంది. మరోపక్క పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహించబోతున్న 'ఫైటర్‌' సినిమాలోనూ విజయ్‌ నటించబోతున్నాడు. ఈ సినిమాను కరణ్‌ జోహార్‌ నిర్మాణంలో.. జాన్వి కపూర్‌ హీరోయిన్​గా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. వీటితోపాటు ఇటీవలే విజయ్‌-దిల్‌రాజు-శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఓ సినిమాను ప్రకటించారు.

ఇదీ చదవండి:-2019లో టాలీవుడ్​ మధుర స్మృతులు..

ABOUT THE AUTHOR

...view details