తక్కువ సినిమాలే చేసిన దేశవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాలో పలు ఘనతల్ని సాధించిన ఇతడు.. ఇప్పుడు మరో రికార్డు సాధించారు. ఇన్‌స్టాలో 11 మిలియన్ల ఫాలోవర్ల మార్క్‌ను అందుకున్నారు విజయ్. దీంతో అతడి అభిమానులు #11millionrowdiesoninsta హ్యాష్‌ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు.
ఇన్‌స్టాలో విజయ్ దేవరకొండ మరో రికార్డు - movie news
కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలోనూ దుమ్ము దులిపేస్తున్నారు. దక్షిణాది హీరోలకు ఇన్‌స్టాలో సాధ్యం కాని ఓ ఘనత సాధించాడు.
విజయ్ దేవరకొండ ఇన్‌స్టాలో మరో రికార్డు
ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా కథతో తీస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదల కానుంది. దీనితో పాటే తన సోదరుడు ఆనంద్ నటిస్తున్న 'పుష్పక విమానం'కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఇవీ చదవండి: