Vijay Deverakonda: ప్రియమణి ప్రధాన పాత్రలో నటించిన కొత్త ఓటీటీ మూవీ 'భామా కలాపం'. జనవరి 31న ఈ సినిమా ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నారు. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ హాజరుకానున్నారు. కామెడీ థ్రిల్లర్‌గా రానున్న ఈ చిత్రంలో ప్రియమణి.. యూట్యూబ్‌లో వంట వీడియోలు చేసి పేరు తెచ్చుకున్న గృహిణిగా కనిపించనుంది.
ఫిబ్రవరి 11న ఓటీటీ ఆహాలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. 'డియర్ కామ్రేడ్' డైరెక్టర్ భరత్ కమ్మ సమర్పణలో బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అభిమన్యు దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
'30 వెడ్స్ 21' సీజన్ 2 షురూ..
గతేడాది యూట్యూబ్‌లో సూపర్‌హిట్‌గా నిలిచిన '30 వెడ్స్ 21' వెబ్‌సిరీస్.. సీజన్ 2కి రెడీ అవుతోంది. ఈ మేరకు ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది నిర్మాణ సంస్థ చాయ్ బిస్కెట్. టీజర్‌ను జనవరి 31న రిలీజ్ చేయనున్నారు. ప్రీటీజర్ను విడుదల చేసి.. సీజన్1ను గుర్తుచేశారు.
30 ఏళ్ల యువకుడికి 21 ఏళ్ల అమ్మాయితో పెళ్లి జరిగితే, వారి మధ్య భావోద్వేగాలు ఎలా ఉంటాయనే కథాంశాన్ని ఆద్యంతం హాస్యభరితంగా, ఆసక్తికరంగా తీర్చిదిద్దారు మేకర్స్. పృథ్వీ, మేఘన పాత్రల్లో చైతన్య రావు, అనన్య ప్రేక్షకులను ఫిదా చేశారు. సినిమాటోగ్రాఫీ, సంగీతం తొలి సీజన్‌కు హైలైట్‌గా నిలిచాయి. పృథ్వీ వనమ్ దర్శకుడు.
ఫిబ్రవరి 4న కిచ్చా సుదీప్.. 'కే3 కోటికొక్కడు' సినిమా విడుదల
సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!
ఇదీ చూడండి:పాన్ఇండియాగా ఎన్టీఆర్30.. ఆరోజే ముహూర్తం!