'బొగ్గు గనిలో.. రంగు మణిరా.. చమక్కుమందిరా..' అంటూ తన మది దోచిన అమ్మాయి గురించి పాటందుకున్నాడు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. అతడు హీరోగా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో వస్తోన్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇజబెల్లా కథానాయికలు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం.. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈసందర్భంగా బుధవారం లిరికల్ వీడియోను విడుదల చేసింది చిత్రబృందం.
విజయ్ దేవరకొండ 'సారూ మస్తుందీ నీ జోరు..' - iswarya rajesh
యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ నటించిన చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఫిబ్రవరి 14న సినిమా విడుదలవుతున్న సందర్భంగా చిత్రబృందం అందుకు తగ్గట్టు ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. బుధవారం ఈ చిత్రంలోని మరో పాటను విడుదల చేసింది.
విజయ్ దేవరకొండ 'సారూ మస్తుందీ నీ జోరు..!'
గోపీ సుందర్ స్వరాలు అందించిన ఈ పాటకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించాడు. నిరంజ్ సురేశ్ ఆలపించారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఏ.వల్లభ నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్లు, టీజర్ ప్రేక్షకులకు సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి. ఇందులో విజయ్ పాత్ర ఆసక్తి రేకెత్తిస్తోంది.
ఇదీ చూడండి...సారా ముద్దుగుమ్మ కాదు బొద్దుగుమ్మ!
Last Updated : Feb 28, 2020, 10:26 AM IST