తెలంగాణ

telangana

ETV Bharat / sitara

అల్లు అర్జున్​ రికార్డును బ్రేక్​ చేసిన రౌడీహీరో - విజయ్​ దేవరకొండ అల్లు అర్జున్​

కథానాయకుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. సోషల్ మీడియాలోనూ దుమ్ము దులిపేస్తున్నారు. దక్షిణాది హీరోలకు ఇన్​స్టాగ్రామ్​లో సాధ్యం కాని ఓ ఘనతను దక్కించుకున్నారు.

Vijay Deverakonda becomes first South actor to reach 12 million followers on Instagram
అల్లు అర్జున్​ రికార్డును బ్రేక్​ చేసిన రౌడీహీరో

By

Published : May 19, 2021, 8:17 PM IST

కెరీర్​లో హీరోగా తక్కువ సినిమాలే చేసి దేశవ్యాప్తంగా క్రేజ్​ తెచ్చుకున్న కథానాయకుడు విజయ్ దేవరకొండ. సోషల్ మీడియాలో పలు ఘనతల్ని సాధించిన ఇతడు.. ఇప్పుడు మరో రికార్డు అందుకున్నారు. ఇన్​స్టాలో 12 మిలియన్ల ఫాలోవర్ల మార్క్​ను చేరుకున్నాడు విజయ్. దీంతో ఆయన అభిమానులు #12millionrowdiesoninsta హ్యాష్​ట్యాగ్​ను ట్రెండ్ చేస్తున్నారు. దీంతో ఇన్​స్టాగ్రామ్​లో అత్యధిక ఫాలోవర్స్​ను దక్కించుకున్న దక్షిణాది హీరోగా విజయ్​ దేవరకొండ నిలిచారు. ఇప్పుటివరకు ఆ స్థానంలో ఉన్న అల్లు అర్జున్​(11.8 మిలియన్​ ఫాలోవర్స్​)ను వెనక్కినెట్టి ఇన్​స్టా ఫాలోవర్స్​లో నంబరు.1గా ఉన్నారు విజయ్​.

విజయ్​ దేవరకొండకు ఇన్​స్టాగ్రామ్​లో 12 మిలియన్లు ఫాలోవర్స్​

విజయ్​ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు పూరీ జగన్నాథ్ తీస్తున్న 'లైగర్' సినిమాలో నటిస్తున్నారు. పాన్ ఇండియా కథతో తీస్తున్న ఈ చిత్రం సెప్టెంబరు 9న థియేటర్లలో విడుదల కానుంది. దీనితో పాటే తన సోదరుడు ఆనంద్​ నటిస్తున్న 'పుష్పక విమానం'కు నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.

ఇదీ చూడండి..'దూరం నుంచి చూస్తే ఐశ్వర్యారాయ్​లా కనిపిస్తా!'

ABOUT THE AUTHOR

...view details