రౌడీ హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను సోమవారం చిత్రబృందం విడుదల చేసింది. ఈ సినిమాకు 'లైగర్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో బాక్సర్‌గా రౌడీ హీరో కనిపించనున్నట్లు తెలుస్తోంది.
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'లైగర్'
విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబోలో రూపొందుతోన్న కొత్త సినిమా టైటిల్, ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం సోమవారం విడుదల చేసింది. 'లైగర్' అనే టైటిల్‌గా ఖరారు చేయగా.. 'సాలా క్రాస్బ్రీడెడ్' అనేది ఉపశీర్షిక. ఫస్ట్‌లుక్‌లో బాక్సర్‌గా విజయ్ ఫోజులిచ్చారు.
విజయ్ దేవరకొండ కొత్త చిత్రం 'లైగర్'
బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం విజయ్.. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నారు. ఇందులో విజయ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ అనన్యపాండే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి పీసీ కనెక్ట్స్, ధర్మా ప్రొడక్షన్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పాన్ఇండియా స్థాయిలో సినిమాను విడుదల చేయనున్నారు.
ఇదీ చూడండి:'మహాభారతం'లో కర్ణుడిగా షాహిద్ కపూర్!