అగ్ర దర్శకుడు పూరి జగన్నాథ్ బృందం 'లైగర్'(liger movie shooting) కోసం మరోసారి రంగంలోకి దిగుతోంది. వచ్చే వారం నుంచి గోవాలో కొత్త షెడ్యూల్ చిత్రీకరణను ఆరంభిస్తారు. నెల రోజులు పైగా సాగే ఈ షెడ్యూల్‌తో కీలక సన్నివేశాల్ని తెరకెక్కించనున్నట్టు తెలుస్తోంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా చిత్రీకరణలో పాల్గొంటుంది.
Liger movie: 'లైగర్' దూకుడు.. గోవాకు చిత్రబృందం - liger heroine
కొత్త షెడ్యూల్ చిత్రీకరణ కోసం 'లైగర్'(liger movie shooting) చిత్రబృందం గోవా వెళ్లనుంది. హీరోహీరోయిన్లతో పాటు ప్రధాన తారాగణం అంతా షూటింగ్లో పాల్గొంటారు. కీలక సన్నివేశాల్ని అక్కడ తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది.
లైగర్
విజయ్ దేవరకొండ హీరోగా(vijay devarakonda liger photos ), బాక్సింగ్ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. బాలీవుడ్ నటి అనన్య పాండే కథానాయిక. పాన్ ఇండియా స్థాయిలో ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే సగానికిపైగా చిత్రీకరణ పూర్తయింది. ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు.
ఇదీ చూడండి: 'లైగర్' భామ హాట్ లుక్స్ అదుర్స్