వరుస చిత్రాలతో అభిమానుల్ని అలరించేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ. ఇటీవలే 'డియర్ కామ్రేడ్'ను పూర్తి చేశాడు. కొత్త సినిమా 'హీరో' నేడు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధిగా విచ్చేశాడు.
రౌడీ 'హీరో' బైక్ రేసింగ్ ప్రారంభం - mythri movie makers
టాలీవుడ్ యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ కొత్త సినిమా 'హీరో' లాంఛనంగా ప్రారంభమైంది. దర్శకుడు కొరటాల శివ ముఖ్య అతిధిగా హాజరయ్యాడు.
'హీరో' విజయ్ బైక్ రేసింగ్ ప్రారంభం
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో ఆనంద్ అన్నామలై దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రేసింగ్ నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో బైకర్‌గా కనిపించనున్నాడీ రౌడీ హీరో. 'పేట'తో ఆకట్టుకున్న మాళవిక మోహనన్ హీరోయిన్గా కనిపించనుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కనుందీ సినిమా.
ఇది చదవండి: 'రష్మిక కళ్ల గురించి విజయ్ దేవరకొండ పాట'
Last Updated : May 19, 2019, 7:48 PM IST