Vijay Devarakonda News: 'అర్జున్‌రెడ్డి', 'గీతాగోవిందం' సినిమాలతో యువతకు దగ్గరైన యువ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం లైగర్ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ మూవీకు నిర్మాణ భాగస్వామి అయిన ధర్మ ప్రొడక్షన్స్ సీఈవో అపూర్వ మెహతా బర్త్‌డే పార్టీలో 'లైగర్' చిత్రబృందం సందడి చేసింది. టీమ్ మొత్తం బ్లాక్ ఔట్‌ఫిట్‌లో మెరిసిపోయింది.
పార్టీలో అనన్య పాండే-విజయ్ దేవరకొండ మధ్య చిట్‌చాట్‌ని ఛార్మి తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. 'మై స్టన్నింగ్ లైగర్ కపుల్.. ఐలవ్యూ బోత్..' అంటూ ఆ వీడియోను షేర్ చేసింది. 'విజయ్ మాట్లాడుతున్న ఈ హాట్ బేబీ ఎవరు.. ఎవరీ బ్యూటీఫుల్ గర్ల్..' అంటూ ఛార్మి వీడియోలో మాట్లాడింది. వెంటనే అనన్య.. ఛార్మి కెమెరా వైపు తిరిగి స్మైల్ ఇచ్చింది. బ్లాక్ నెట్ డ్రెస్‌లో ఉన్న అనన్య ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.