ఓవైపు కథానాయకుడిగా.. మరోవైపు నిర్మాతగా వరుస చిత్రాలతో తీరిక లేకుండా గడుపుతున్న విజయ్ దేవరకొండ.. ఇప్పుడు ఓటీటీ వెబ్‌సిరీస్‌ల వైపు చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థ కింగ్ ఆఫ్ హిల్స్ నుంచి ఓ వెబ్‌సిరీస్‌ను తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన అల్లు అరవింద్ ఓటీటీ ప్లాట్‌ఫాం 'ఆహా'కు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.
వెబ్‌సిరీస్ వైపు దేవరకొండ చూపు! - వెబ్ సిరీస్ నిర్మించనున్న విజయ్ దేవరకొండ
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వెబ్‌సిరీస్‌ల వైపు చూస్తున్నట్లు సమాచారం. త్వరలోనే ఆయన నిర్మాణ సంస్థ నుంచి ఓ వెబ్‌సిరీస్ రానుందని తెలుస్తోంది.
![వెబ్‌సిరీస్ వైపు దేవరకొండ చూపు! విజయ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7205315-thumbnail-3x2-vij.jpg)
విజయ్
ఇప్పుడు దీనికోసమే తాను కూడా కొన్ని వెబ్‌సిరీస్‌లను ప్లాన్ చేస్తున్నాడట. ఇప్పటికే ఓ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. యువ దర్శకుడు కేవీఆర్ మహేంద్రతో దీన్ని తెరకెక్కించనున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇతడు గతంలో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండతో 'దొరసాని' చిత్రం తీసి మెప్పించాడు. ఈ నేపథ్యంలోనే అతడి టేకింగ్ స్టైల్ నచ్చి ఈ ప్రాజెక్టును అప్పగించబోతున్నట్లు తెలుస్తోంది. లాక్‌డౌన్ పూర్తికాగానే దీని వివరాలు అధికారికంగా బయటకు రానున్నాయి.