Vijay Devarakonda on Cinema Tickets: తెలంగాణలో సినీ పరిశ్రమను నూటికి నూటొక్క శాతం పరిశ్రమగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ అన్నారు. దేశంలోనే అతి పెద్ద పరిశ్రమలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఒకటని పేర్కొన్న విజయ్... ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సినిమా టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. తన ప్రభుత్వాన్ని ఎంతో ప్రేమిస్తున్నానని, సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్న తెలంగాణ సర్కార్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేనన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ రాష్ట్రంలో ఆరోగ్యకరమైన అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారని విజయ్ కొనియాడారు. ఇందుకు నిదర్శనమే తెలంగాణలో సినిమా టికెట్ ధరల సవరింపు అని అన్నారు. టికెట్ ధరలను పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన జీవోను ట్విట్టర్ ద్వారా విజయ్ అభిమానులతో పంచుకున్నారు.
అంతకముందు చిరంజీవి..
Chiranjeevi on Cinema Tickets Price: తెలంగాణలో సినిమా టికెట్ ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. ధరలు సవరించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. థియేటర్ల మనుగడకు, వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు చేసే నిర్ణయం తీసుకున్నారని కొనియాడారు. అన్ని వర్గాల వారికి న్యాయం చేశారని ట్విటర్ వేదికగా అన్నారు. తెలుగు సినీ పరిశ్రమ కోరికను మన్నించి కేసీఆర్ సత్వరమే నిర్ణయం తీసుకోవడం పట్ల మెగాస్టార్ సంతోషం వ్యక్తం చేశారు. నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యానికి న్యాయం జరిగేలా టికెట్ ధరలను సవరించడం ఆనందంగా ఉందన్నారు.
AP Cinema Tickets Issue : మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో టికెట్ ధరలపై వివాదం ఇంకా సద్దుమణగకపోవడంతో అక్కడి థియేటర్ యాజమాన్యాలు తాత్కాలికంగా సినిమా హాల్స్‌ను మూసివేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై సినీ పెద్దలు జోక్యం చేసుకొని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌తో చర్చలు జరపాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి:
Chiranjeevi on Cinema Tickets Price : సినిమా టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ హర్షం.. కేసీఆర్‌కు కృతజ్ఞతలు