'అల వైకుంఠపురములో' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్‌కు క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ ఓ చక్కటి సర్‌ప్రైజ్‌ను అందించాడు. తాజాగా దీనికి సంబంధించి బన్నీ రౌడీ హీరోకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్విట్టర్ వేదికగా ఆ కానుకను ప్రేక్షకులతో పంచుకున్నాడు.
ఇంతకీ స్టైలిష్ స్టార్‌కు ఈ యువ హీరో పంపిన కానుక మరేదో కాదు.. దేవరకొండ రౌడీ బ్రాండింగ్ దుస్తులు. 'అల వైకుంఠపురములో' చిత్రం విజయవంతం కావాలని కోరుకుంటూ ప్రేమతో బన్నీకి ఈ కానుక పంపినట్లు ఆ దుస్తులపై పెట్టిన గ్రీటింగ్ బట్టి తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఫొటోను అల్లు అర్జున్ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంటూ దేవరకొండకు థ్యాంక్స్ చెప్పాడు.