తెలంగాణ

telangana

ETV Bharat / sitara

'భావోద్వేగానికి గురై ఏడ్చిన సందర్భాలెన్నో'

హైదరాబాద్​లో శనివారం ఏర్పాటు చేసిన 'డియర్ కామ్రేడ్' ​సక్సెస్​ మీట్​లో భావోద్వేగానికి లోనయ్యాడు హీరో విజయ్ దేవరకొండ. ఈ సినిమా తనకెంతో ప్రత్యేకమని చెప్పాడు.

సినిమా

By

Published : Jul 27, 2019, 10:17 PM IST

తన కెరీర్‌లో 'డియర్‌ కామ్రేడ్‌' మర్చిపోలేని చిత్రమన్నాడు హీరో విజయ్ దేవరకొండ. శనివారం హైదరాబాద్​లో నిర్వహించిన చిత్ర సక్సెస్​మీట్​లో భావోద్వేగానికి గురయ్యాడు ఈ కథానాయకుడు. ఈ సినిమాతో తన ప్రయాణాన్ని పంచుకున్నాడు.

మాట్లాడుతున్న విజయ్

​"ఈ చిత్రం నాకు చాలా ప్రత్యేకం. సినిమా చేస్తున్న ఏడాది పాటు భావోద్వేగాలకి లోనై ఏడ్చిన సందర్భాలెన్నో. ప్రేక్షకులూ అలాంటి భావోద్వేగానికే గురయ్యారు. చూస్తున్నంతసేపూ కథలో లీనమైపోయారు. నేను చేయగలిగిందంతా చేశాను. రష్మిక చాలా బాగా నటించింది. అన్నిభాషల వారికీ నచ్చేలా తెరకెక్కించాడు దర్శకుడు భరత్‌. తొలి భాగం నవ్వించింది. ద్వితీయార్థం భావోద్వేగాలతో కట్టిపడేసింది. కామ్రేడ్స్‌ అంటే మిత్రులు, అభిమానులే. వాళ్లకు దీన్ని అంకితమిస్తున్నా. భరత్‌ వాళ్ల నాన్నకి అంకితమిచ్చారు. ఇలాంటి సినిమా చేసినందుకు కొంచెం గర్వంగానూ ఉంది" -విజయ్ దేవరకొండ, హీరో

ఈ కార్యక్రమంలో హీరోయిన్ రష్మిక మందణ్నతో పాటు దర్శకుడు భరత్, నిర్మాతలు, సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్ తదితరులు హాజరయ్యారు.

చిత్ర యూనిట్

ఇవీ చూడండి.. 'స్టేజిపై పాటలు పాడకపోవడానికి కారణం అదే'

ABOUT THE AUTHOR

...view details