సినిమా ప్రమోషన్స్ కోసం నిర్మాతలు వినూత్న ఆలోచనలతో ముందుకొస్తున్నారు. బాలీవుడ్‌కు మేమూ ఏం తీసిపోలేదంటూ విభిన్న ప్రచారాలతో ఆకట్టుకుంటోంది టాలీవుడ్. తాజాగా హీరో విజయ్ దేవరకొండ ఇలాంటి ప్రయోగమే చేశాడు.
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మాతగా మారి తీస్తున్న తొలి చిత్రం 'మీకు మాత్రమే చెప్తా'. ఈ సినిమా నేడు (నవంబర్ 1) విడుదలైంది. అయితే తన మూవీ కోసం టికెట్లను అమ్ముతూ కనిపించాడు దేవరకొండ. అభిమాన హీరోను చూసేందుకు.. అతడి వద్ద టికెట్లు తీసుకునేందుకు ఫ్యాన్స్ పోటీపడ్డారు.