ప్రస్తుతం హైదరాబాద్‌లో లేనందుకు విచారంగా ఉందని తెలిపారు యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో నటించే సినిమా చిత్రీకరణ కోసం ఆయన విదేశానికి వెళ్లారు. భౌతికంగా అక్కడ ఉన్నా మనసంతా హైదరాబాద్లోనే ఉందన్నారు.
'నా మనసంతా హైదరాబాద్లోనే' - vijay devarakonda sad on hyderavad
కుండపోత వర్షాలతో విలవిలలాడుతోన్న హైదరాబాద్ గురించి ట్వీట్ చేస్తూ విచారం వ్యక్తం చేశారు నటుడు విజయ్ దేవరకొండ. భౌతికంగా తాను విదేశాల్లో ఉన్నా మనసంతా మహానగరంలోనే ఉందన్నారు.
వర్షం కారణంగా హైదరబాద్ మహానగరం వణికిపోతోంది. కొన్ని ప్రాంతాలు అస్తవ్యస్థంగా మారాయి. ఈ నేపథ్యంలో విజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. " హైదరాబాద్‌కు దూరంగా ఉన్నందుకు బాధగా ఉంది. మీ గురించే ఆలోచిస్తున్నా. అందరూ బాగుండాలని ప్రార్థిస్తున్నా. అమ్మఒడి లాంటి సొంత నగరాన్ని తిరిగి చేరుకునేందుకు వేచి చూస్తున్నా" అని ట్వీట్ చేశారు విజయ్. "మేము నిన్ను చాలా మిస్ అవుతున్నాం విజయ్", "నువ్వు జాగ్రత్తగా ఉండు", "త్వరగా వచ్చేయ్" అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
ఇదీ చూడండి సిక్స్ ప్యాక్ ఎన్టీఆర్.. వైరల్ ఫొటో