Vijay Devarakonda Rashmika: 'గీత గోవిందం', 'డియర్ కామ్రేడ్'లతో ఆన్‌స్క్రీన్ లవ్లీ పెయిర్‌గా పేరు తెచ్చుకున్నారు విజయ్ దేవరకొండ, రష్మిక. ప్రస్తుతం కెరీర్‌లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న ఈ జంట ఇటీవలే ముంబయి వీధుల్లో చక్కర్లు కొట్టారు. షూటింగ్స్ నుంచి కాస్త విరామం దొరకడం వల్ల ఆదివారం సాయంత్రం బాంద్రాలోని ఓ రెస్టారెంట్‌లో డిన్నర్‌కు వెళ్లారు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట్లో తెగ చక్కర్లు కొడుతున్నాయి.
చాలా రోజుల తర్వాత విజయ్-రష్మిక కలిసి కనిపించడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 'లవ్లీ పెయిర్' అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరోవైపు, రష్మిక-విజయ్ ప్రేమలో ఉన్నారంటూ పలుమార్లు వార్తలు వచ్చాయి. అవన్నీ అవాస్తవాలేనని.. తాము మంచి స్నేహితులం మాత్రమేనని గతంలో ఈ జంట సమాధానమిచ్చింది.