తెలంగాణ

telangana

ETV Bharat / sitara

రౌడీహీరో బాలీవుడ్​ ఎంట్రీ.. 'ఫైటర్' షూటింగ్ ప్రారంభం - entertainment newsvijay-puri jagannath-charmee

విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్ కాంబినేషన్​లోని కొత్త చిత్రం ముంబయిలో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో బాలీవుడ్​లో అడుగుపెడుతున్నాడు రౌడీ హీరో.

రౌడీహీరో బాలీవుడ్​ ఎంట్రీ.. 'ఫైటర్' షూటింగ్ ప్రారంభం
విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్

By

Published : Jan 20, 2020, 11:04 AM IST

రౌడీహీరో విజయ్ దేవరకొండ.. బాలీవుడ్​ ఎంట్రీ ఖరారైంది. పూరీ జగన్నాథ్ తీస్తున్న కొత్త సినిమాతో అక్కడ అడుగుపెడుతున్నాడు. అందుకు సంబంధించిన షూటింగ్ నేడు(సోమవారం).. ముంబయిలో లాంఛనంగా మొదలైంది.

'ఫైటర్' షూటింగ్ ప్రారంభం

ఈ సినిమాకు 'ఫైటర్' టైటిల్​ను అనుకుంటున్నారు. కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వీరితో పాటే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత కరణ్ జోహార్ ప్రాజెక్టులో భాగమయ్యారు. ఈ విషయాన్ని ప్రముఖ సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విటర్ ద్వారా వెల్లడించారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

విజయ్ దేవరకొండ-పూరీ జగన్నాథ్-ఛార్మీ

ఈ సినిమా కోసం విజయ్.. థాయ్‌లాండ్​లో మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు. ఇందులో రమ్యకృష్ణ కీలక పాత్రలో కనిపించనుంది. 'జై లవకుశ' ఫేమ్ రోనిత్ రాయ్ విలన్​గా కనిపించనున్నాడు. హీరోయిన్​గా అనన్య పాండే నటించబోతుంది.

హీరోయిన్ అనన్య పాండే

ABOUT THE AUTHOR

...view details