తెలంగాణ

telangana

ETV Bharat / sitara

సిక్స్​ప్యాక్​ 'ఫైటర్'​గా విజయ్ దేవరకొండ - vijay fighter

విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్ చిత్రానికి 'ఫైటర్​' టైటిల్​ ఖరారు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

విజయ్ దేవరకొండ- పూరీ జగన్నాథ్

By

Published : Aug 23, 2019, 6:01 AM IST

Updated : Sep 27, 2019, 11:02 PM IST

'ఇస్మార్ట్​ శంకర్​'తో హిట్​ అందుకున్నాడు దర్శకుడు పూరీ జగన్నాథ్. తన తర్వాతి సినిమా యువహీరో విజయ్ దేవరకొండతో చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించాడు. అయితే ఆ చిత్రానికి 'ఫైటర్' అనే టైటిల్​ నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో విజయ్ సిక్స్​ప్యాక్​లో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే రౌడీ అభిమానుల​కు పండగే.

హీరోల‌ను మాస్ కోణంలో తెర‌పై ఆవిష్కరించే పూరీ జ‌గ‌న్నాథ్.. విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను కొత్తగా చూపేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇందులో హీరోయిన్​గా జాన్వీ కపూర్ నటించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. డిసెంబరు నుంచి సెట్స్​పైకి వెళ్లనుంది. పూరీ, చార్మీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విజయ్ దేవరకొండ-జాన్వీ కపూర్

'డియర్ కామ్రేడ్​' చిత్రంతో ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చాడు విజయ్.ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు. రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్​ కథానాయికలుగా నటిస్తున్నారు.

ఇది చదవండి: ఫోర్బ్స్​ సంపాదనలో హాలీవుడ్​ హీరోలతో అక్షయ్ పోటీ

Last Updated : Sep 27, 2019, 11:02 PM IST

ABOUT THE AUTHOR

...view details