ప్రతి తరంలో ఓ ట్రెండ్ సెట్టర్ వెండితెరపై వెలుగులు విరజిమ్మడానికి రాకెట్‌లా తెరపైకి వచ్చి వాలుతూనే ఉంటాడు. కింది ఫొటోలో కనిపిస్తున్న స్టార్ హీరో కూడా ఇలా తెరపైకి దూసుకొచ్చినవాడే. అందుకే ఇప్పుడు దక్షిణాదిలోనే మోస్ట్ వాంటెడ్ హీరోగా నిలిచాడు. ఇంతకీ ఆ క్రేజీ స్టార్ ఎవరో కాదు, సినీ ప్రియుల ముద్దుల రౌడీ.. విజయ్ దేవరకొండ.
కొత్త లుక్‌తో అదరగొడుతున్న 'రౌడీ' - vijay devara konda new movie
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ తాజాగా దిగిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. ఈ చిత్రాల్లో స్టైలిష్ లుక్‌లో అదరగొడుతున్నాడీ హీరో.
విజయ్
తాజాగా ఈ రౌడీ హీరో కిరాక్ ఫొటో షూట్‌తో యువతరం గుండెల్లో కాకలు రేపాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇది ఏదైనా యాడ్ కోసమో? లేక తన కొత్త చిత్రం 'ఫైటర్' కోసమో తెలీదు కానీ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
ఇవీ చూడండి.. రెండోసారి తల్లి కాబోతోంది నటి స్నేహ