టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ హీరోగా క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. కె.ఎస్ రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ వల్లభ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌ను ప్రకటించింది చిత్రబృందం.
'వరల్డ్ ఫేమస్ లవర్' అనే టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు విజయ్. ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాశీఖన్నా, ఐశ్వర్యా రాజేష్,, క్యాథరీన్, ఇజాబెల్లె దె హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.