తెలంగాణ

telangana

ETV Bharat / sitara

నేచురల్​ స్టార్​ నానితో రౌడీ హీరో మరోసారి! - కరీనా కపూర్​

వైవిధ్యభరిత ప్రేమకథలతో యువతరంలో మంచి క్రేజ్‌ సంపాదించుకున్నారు నేచురల్‌ స్టార్‌ నాని, రౌడీ హీరో విజయ్‌ దేవరకొండ. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో చిత్రం తెరకెక్కనుంది. ఈ చిత్రానికి ఓ ప్రముఖ నిర్మాత బాధ్యతలు తీసుకుంటున్నట్లు సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి.

vijay-devarakonda-nani-goodness-remake
బాలీవుడ్​ రీమేక్​లో నటించనున్న నాని, విజయ్​

By

Published : Dec 30, 2019, 9:19 AM IST

నేచురల్ స్టార్​ నాని, రౌడీ బాయ్​ విజయ్​ దేవరకొండ వీళ్లిద్దరి కలయికలో వచ్చిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' బాక్సాఫీస్‌ వద్ద మంచి ఆదరణ దక్కించుకుంది. అయితే అప్పటికి విజయ్‌ అంత పెద్ద హీరో కాకపోయినా.. 'అర్జున్‌రెడ్డి', 'గీత గోవిందం', 'టాక్సీవాలా' చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. మరోసారి వీరి ఇరువురి కలయికలో చిత్రమొస్తే ప్రేక్షకుల్లో భారీ అంచనాలుంటాయి. అయితే ఈ వార్త నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

గుడ్​న్యూస్​ చిత్రంలో అక్షయ్​, కరీనా, కియారా, దిల్జిత్‌

ప్రముఖ నిర్మాత సురేశ్​ బాబు ఈ చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నట్టు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం బాలీవుడ్‌లో విజయవంతంగా ప్రదర్శితమవుతోన్న అక్షయ్‌ కుమార్‌ - ధిల్జిత్‌ ధోసాంజె 'గుడ్‌న్యూస్‌' చిత్రాన్ని తెలుగులో నాని - దేవరకొండలతో రీమేక్‌ చేస్తే బాగుంటుందని ఆయన ఆలోచన చేస్తున్నారట. ఇప్పటికే ఈ సినిమా రీమేక్‌ హక్కులను సొంతం చేసుకునే పనిలో ఉన్నారని.. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ కథను నాని - రౌడీలతో తెరకెక్కించాలని అనుకుంటున్నారట.

ఇదీ కథ..
వరుణ్‌ బత్రా (అక్షయ్‌), దీప్తి బత్రా (కరీనా) భార్యాభర్తలు. సంతానం కలగకపోవడం వల్ల కృత్రిమ గర్భధారణ కోసం ఓ ఆసుపత్రిని సంప్రదిస్తారు. అలాంటి సమస్యతోనే హనీ బత్రా (దిల్జిత్‌), మోనికా బత్రా (కియారా) అదే ఆసుపత్రికి వస్తారు. అయితే రెండు జంటల ఇంటి పేర్లు బత్రానే కావడం వల్ల వైద్యులు పొరబడతారు. వరుణ్‌ శుక్రకణాలను మోనికా అండంతో, హనీ శుక్రకణాలను దీప్తి అండంతో ఫలదీకరణ చేస్తారు. ఈ కారణంగా వరుణ్‌ సంతానం మోనికా గర్భంలో, హనీ సంతానం దీప్తి గర్భంలో పెరుగుతుంటుంది. ఆ విషయం తెలిశాక వైద్యులు నాలిక్కరుచుకుంటారు. సంతానం కలగబోతోందంటూ గుడ్‌న్యూస్‌ చెప్పాల్సిన సమయంలో ఈ తారుమారు విషయాన్ని నీళ్లు నములుతూ చెబుతారు. అప్పుడు ఆ రెండు జంటలు ఎలా స్పందించాయి? సరిదిద్దుకోలేని ఈ తప్పిదం వారి జీవితాల్లో ఎలాంటి కల్లోలం సృష్టించింది? ఈ సమస్య ఎలా ముగిసింది? వంటి అంశాలతో ఆద్యంతం ఎంతో వినోదాత్మకంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ మాతృకను హిందీలో రాజ్‌ మెహతా తెరకెక్కించారు.

ఇదీ చదవండి:- నెట్టింట వైరల్​గా 'ఆర్​ఆర్​ఆర్' పోస్టర్

ABOUT THE AUTHOR

...view details