యువ కథానాయకుడు విజయ్ దేవరకొండతో తన సినిమా తప్పకుండా ఉంటుందని దర్శకుడు మోహన్‌కృష్ణ ఇంద్రగంటి చెప్పారు. పూరీ జగన్నాథ్, శివ నిర్వాణ చిత్రాలు పూర్తయిన తర్వాత తమ కాంబోలో ప్రాజెక్టు మొదలవుతుందని ఇంద్రగంటి ఈటీవీ భారత్‌కు వెల్లడించారు.
విజయ్ 'లైగర్' టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పిన ఇంద్రగంటి... విభిన్న టైటిల్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం పూరీ స్టైల్ అని కితాబిచ్చారు. మూడోసారి సుధీర్‌బాబుతో రొమాంటిక్ డ్రామా చేస్తున్నానని చెప్పారు. మార్చి నుంచి షూటింగ్ మొదలవుతుందని అన్నారు.