విజయ్ దేవరకొండ నటిస్తోన్న కొత్త చిత్రం హీరో. ఈ సినిమా ఆగిపోయిందంటూ వార్తలు షికార్లు చేస్తున్నాయి. దీనిపై చిత్రబృందం కానీ, విజయ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. స్క్పిప్ట్లో మార్పులు చేసి మళ్లీ రీషూట్ చేయాలని నిర్ణయించిందట చిత్రబృందం. ఇందుకోసం అవసరమైతే దర్శకుడిని మార్చే ఆలోచనల్లో ఉన్నట్టు సమాచారం.
ఆనంద్ అన్నామలై అనే నూతన దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో రౌడీ హీరో బైక్ రేసర్‌గా కనిపించనున్నాడు. మైత్రీ సంస్థ ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మించాలని రంగంలోకి దిగింది. ఇందుకోసం 50 కోట్ల బడ్జెట్‌ను కేటాయించింది. బైక్ రేసులకు సంబంధించి చిత్రీకరణ మొదలుపెట్టగా కొద్దిపాటి షెడ్యూల్‌కే రూ. 6 కోట్లు ఖర్చయిందట. అవుట్‌పుట్ కూడా అనుకున్నంత స్థాయిలో రాకపోయేసరికి సినిమాను తాత్కాలికంగా ఆపేసిందట.