వరుస సినిమాలతో జోరుమీదున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ యువ హీరో నటించిన 'డియర్ కామ్రేడ్' చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో మరో సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి కేఏ వల్లభ నిర్మాత. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేష్, ఇజాబెల్లేదే హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నాడు.
వరుస సినిమాలతో రౌడీ హీరో జోరు - ఐశ్వర్యా రాజేష్
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది.
![వరుస సినిమాలతో రౌడీ హీరో జోరు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3466552-thumbnail-3x2-cinema.jpg)
విజయ్ దేవరకొండ
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఫ్రాన్స్‌లో జరుగుతోంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇదో ముక్కోణపు ప్రేమకథని.. ముగ్గురు అమ్మాయిలు, ఓ అబ్బాయి మధ్య జరిగే సరదా సన్నివేశాలు యువతరాన్ని ఆకట్టుకుంటాయని చెబుతోందీ చిత్రబృందం.
ఇవీ చూడండి.. 'ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసేందుకు సిద్ధమే'
Last Updated : Jun 4, 2019, 12:39 PM IST