హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న 'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్.. ఈరోజు(గురువారం) ప్రేక్షకుల ముందుకొచ్చింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన విజయ్.. తన సినీ కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఈ సినిమానే తన చివరి ప్రేమకథ కావొచ్చని, అందుకే ఈ పాత్రలో నిమగ్నమై నటించానని అన్నాడు.
విజయ్ ఇకపై ప్రేమకథల్లో నటించడు! - విజయ్ సినిమాలు
'వరల్డ్ ఫేమస్ లవర్' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో తన కెరీర్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టాడు హీరో విజయ్ దేవరకొండ. ఇంతకీ అదేంటంటే?
విజయ్ ఇకపై ప్రేమకథల్లో నటించాడు!
ఇందులో విజయ్ సరసన రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇస్బెల్లా హీరోయిన్లుగా నటించారు. గోపీసుందర్ సంగీతమందించాడు. క్రాంతి మాధవ్ దర్శకుడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కేఎస్ రామారావు నిర్మించారు. ప్రీరిలీజ్ వేడుక ఈనెల 9న నిర్వహించనున్నారు. 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది సినిమా.
ఇదీ చదవండి:'బాఘీ 3' ట్రైలర్: మా అన్న జోలికొస్తే ఊరుకోను
Last Updated : Feb 29, 2020, 10:51 AM IST