టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వరల్డ్ ఫేమస్ లవర్'. ఇటీవలే టైటిల్ ప్రకటించిన చిత్రబృందం, ఇప్పుడు విజయ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో ముఖంపై రక్తం.. చేతిలో సిగరెట్‌తో ఓ డిఫరెంట్ లుక్‌లో కనిపించాడీ కథానాయకుడు. ఈ ఫొటో సినిమాపై అంచనాల్ని పెంచుతోంది.
ముఖంపై రక్తంతో 'వరల్డ్ ఫేమస్ లవర్' - విజయ్ దేవరకొండ
'వరల్డ్ ఫేమస్ లవర్' పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో హీరో విజయ్ దేవరకొండ లుక్ విడుదలైంది. విభిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటోంది.
హీరో విజయ్ దేవరకొండ
ఈ చిత్రంలో రాశీఖన్నా, ఐశ్వర్య రాజేశ్, కేథరిన్, ఇజ్బెల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. గోపీసుందర్ సంగీతమందిస్తున్నాడు. క్రాంతిమాధవ్ దర్శకత్వం వహిస్తున్నాడు. క్రియేటివ్ కమర్షియల్స్ పతాకంపై కె.ఎస్.రామారావు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఇది చదవండి: రివ్యూ: సరికొత్త గ్యాంగ్‌స్టర్‌గా 'గద్దలకొండ గణేష్'
Last Updated : Oct 1, 2019, 8:45 AM IST