విజయ్ దేవరకొండ 'లైగర్'కు సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. సోమవారం సాయంత్రం 4 గంటలకు 'లైగర్' ప్రామిస్ వెల్లడిస్తామంటూ ప్రకటించారు. అది టీజర్ గురించి లేదా సినిమా విడుదల గురించా అనేది తెలియాల్సి ఉంది.
యాక్షన్ కింగ్ అర్జున్, టీమ్ఇండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నటిస్తున్న చిత్రం 'ఫ్రెండ్షిప్'. ఈ సినిమా ట్రైలర్ను కింగ్ నాగార్జున సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేయనున్నారు.
'గుంటూర్ టాకీస్' ఫేమ్ సిద్ధు, నేహ శెట్టి నటించిన 'డీజే టిల్లు' టీజర్ విడుదలైంది. సిద్ధు హావాభావాలతో ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది.
ఆది పినిశెట్టి 'క్లాప్' టీజర్.. సోమవారం సాయంత్రం 5.04 గంటలకు మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదలకానుంది.