మొదటి నుంచి వైవిధ్య కథలను, పాత్రలను ఎంచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ. యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న ఈ నటుడు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో 'మోస్ట్ డిజైరబుల్ మెన్' జాబితాలో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
బాలీవుడ్ హీరోలను దాటి విజయ్ దేవరకొండ రికార్డు - విజయ్ దేవరకొండ తాజా వార్తలు
మోస్ట్ డిసైరబుల్ మెన్ జాబితాలో విజయ్ దేవరకొండ రికార్డు సృష్టించాడు. బాలీవుడ్ హీరోలను దాటి మూడోస్థానంలో నిలిచాడు. షాహిద్ కపూర్, రణ్‌వీర్ సింగ్‌లు ఇతడి కంటే ముందున్నారు.
తెలుగులోనే కాదు జాతీయ స్థాయి యూత్‌లో విజయ్ మంచి గుర్తింపు ఉంది. ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఎక్కువ మంది ఫాలోవర్స్ దక్కించుకున్న తొలి దక్షిణాది నటుడిగా విజయ్ రికార్డు కొట్టాడు. ఇప్పుడు మరో మైలురాయి అందుకున్నాడు. ఇండియాలోని టాప్ 50 మోస్ట్ డిజైరబుల్ మెన్ జాబితాలో విజయ్ ఏకంగా మూడో స్థానంలో నిలిచాడు. మొదటి స్థానంలో షాహిద్ కపూర్, రెండో స్థానంలో రణ్‌వీర్ సింగ్ ఉండగా మిగతా బాలీవుడ్ హీరోలను కిందకు నెట్టి విజయ్ మూడో స్థానం సొంతం చేసుకున్నాడు.
గతంలోనూ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్‌గా వరుసగా 2018, 2019 సంవత్సరాల్లో విజయ్ మొదటి స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్'(వర్కింగ్ టైటిల్)లో నటిస్తున్నాడు. అనన్య పాండే కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా.. కరోనా వైరస్, లాక్‌డౌన్ కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది. పాన్ ఇండియా మూవీగా తీస్తుండటం వల్ల భారీ అంచనాలు ఉన్నాయి.