ప్రస్తుతం తెలుగు చిత్రసీమ కథానాయకులు ఓవైపు నటులుగా, మరోవైపు నిర్మాతలుగా ఇంకోవైపు ఇతర వ్యాపారాలతో బిజీగా గడిపేస్తున్నారు. మహేష్‌బాబు, ప్రభాస్ వంటి స్టార్లయితే ఓవైపు వరుస సినిమాలతో స్టార్ హీరోలుగా సత్తా చాటుతూనే మల్టీప్లెక్స్‌ల బిజినెస్‌లలోనూ దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం మహేష్‌కు ఏఎంబీ సినిమాస్ ఉండగా.. ప్రభాస్‌కు భీమవరంలో ఓ మల్టీప్లెక్స్ థియేటర్ ఉంది. ఇప్పుడీ ఇద్దరూ తమ మల్టీప్లెక్స్‌లను వివిధ ప్రాంతాలకు విస్తరించే ప్రయత్నాల్లో ఉన్నారు.
ప్రభాస్.. మహేష్‌ల దారిలోనే రౌడీ హీరో - ప్రభాస్
టాలీవుడ్ అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూనే సొంత బిజినెస్‌లతో రాణిస్తున్నారు. వీరిద్దరి బాటలోనే పయనించేందుకు సిద్ధమవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ.
ఇప్పుడు వీరి బాటలోనే అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఈ క్రేజీ స్టార్ రౌడీ పేరుతో ఓ వస్త్ర వ్యాపారంలో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడీ యువ హీరో చూపు మల్టీప్లెక్స్ బిజినెస్‌పై పడిందట. అందుకే ఏషియన్ సినిమాస్ సంస్థతో కలిసి తన పేరు మీదుగా ఏవీడీ అనే పేరుతో హైదరాబాద్, మహబూబ్‌నగర్‌లో మల్టీప్లెక్స్ థియేటర్లు నిర్మించబోతున్నాడట. ఈ ఏడాది వేసవి నాటికి ఈ రెండిటిని ప్రేక్షకులకు అందుబాటులోకి తేవాలని రౌడీ లక్ష్యంగా పెట్టుకున్నాడట.
ఇవీ చూడండి.. సైలెన్స్ అంటున్న 'ది బిగ్ బుల్' అభిషేక్ బచ్చన్